తిరుపతిలో 'కాపు" కాసెదెవరికి ! 15 శాతం ఓటర్లు వాళ్లే..
తిరుపతిలో 'కాపు" కాసెదెవరికి ! 15 శాతం ఓటర్లు వాళ్లే..
ఏప్రిల్ 17న జరగబోతున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో ఈ సారి త్రిముఖ పోరు తప్పేలా కనిపించడం లేదు.. చాలా ఈజీగా గెలుస్తాం.. గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో దేశం దృష్టిని ఆకర్షిస్తామని వైసీపీ చెబుతుంటే.. మమ్మల్ని తక్కువ అంచనా వేయోద్దు.. తెరవెనుక జరుగుతోంది మరోకటంటూ బిజెపి అంటోంది.. గట్టి పోటీ ఇస్తామని టీడీపీ చెబుతోంది.. టీడీపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, వైసీపీ నుంచి డా. గురుమూర్తి, బిజెపి నుంచి మాజీ సీఎస్ రత్నప్రభ బరిలో ఉన్నారు... అయితే 16 లక్షల పైచిలుకు ఓటర్లున్న ఈ పార్లమెంట్ పరిధిలో కాపు, బలిజ సామాజికవర్గ ఓటర్లు కీలకం కానున్నారా.. అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేయనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది..
ముఖ్యంగా ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ అయినప్పటికీ.. బలిజ సామాజికవర్గం ఓట్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నాయి.. అందుకే గతంలో ఈ పార్లమెంట్ పరిధిలోని తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి సినీనటుడు చిరంజీవి ప్రజారాజ్యం తరపున పోటీ చేసి గెలుపొందారు. అలాగే జనసేన బలపరిచిన బీఎస్పీ అభ్యర్థికి పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు వచ్చాయి.. అందుకే ఈ సీటు జనసేన కు ఇచ్చి ఉంటే వైసీపీ కి గట్టి పోటీ ఇచ్చేదనే చర్చ జరిగినప్పటికీ.. చివరకి బిజెపి పోటీ చేస్తుండటంతో కాపు ఓటు ఫ్యాక్టర్ ఎలా పనిచేస్తుందోనన్న అనుమానం కల్గుతోంది... మొత్తం పార్లమెంట్ పరిధిలో 2 లక్షల 44 వేల కాపు సామాజికవర్గం ఓట్లు ఉన్నాయి.. అంటే మొత్తం ఓట్లలో 15 శాతం. నియోజకవర్గాల వారీగా కాపుల ఓటు శాతం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
Total Tirupathi Parliament kapu voters list
Tirupathi-42%
Sir Kalahasti-14%
Sathavedu(SC)-7%
Gurur (SC)-13%
Sulurupeta(SC)-12%
Venkatgiri-9%
Sarvepalli-12%
మొత్తం ఓటర్లు లో
కాపు ఓటర్ల శాతం 15.57 శాతం
మొత్తం కాపు ఓటర్లు -2,44,009
తిరుపతి ఆధ్యాత్మిక పట్టణం కావడంతో బిజెపి పట్ల కొంత సానుభూతి ఉంటుందని దీనికి తోడు కాపు ఓటు తోడైతే ఖచ్చితంగా విజయం సాధిస్తామని కమలనాథులు అంటున్నారు.. అయితే బిజెపి మాత్రం పవన్ కల్యాణ్ పైనే ఆశలు పెట్టుకొంది. పవన్ ప్రచారంతో ఖచ్చితంగా బలిజ సామాజికవర్గ ఓట్లుతో పాటు మిగతా కులాల్లో ఉన్న పవన్ అభిమానుల ఓట్లు ప్లస్ అవుతాయని కమలదళం లెక్కలు వేసుకుంటోంది.. అయితే సంక్షేమ పథకాల లబ్దిదారుల్లో కాపులు కూడా ఉన్నారని.. ఖచ్చితంగా ఉన్న మొత్తం కాపు , బలిజ ఓట్లలో 50 శాతానికి పైగా మాకు పడతాయని దీనికి తోటు ఎస్సీ , బీసీలు వైసీపీతో ఉన్నారని.. విజయం తమదేనని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది.. చూద్దాం ఈసారి తిరుపతిలో కాపులు కాపు కాసెదవరికో...

Comments
Post a Comment